TG: రాష్ట్రంలోని జనరల్ గురుకులాలు, 93 కేజీబీవీలలో ఇంటర్ ప్రవేశాలకుగానూ మే నెల 3వ తేదీన టీజీఆర్జేసీ సెట్ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు 27వ తేదీ నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ తెలిపారు.