TG: రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం అందజేశారు. ప్రస్తుత బడ్జెట్లోనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం నిధులు కేటాయించాలని కోరుతూ చర్చ పెట్టాలని కోరారు. మరోవైపు సీపీఐ కూడా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌పై చర్చకు డిమాండ్ చేయనుంది.