AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. పవన్ చాలా ధైర్యవంతుడని, తర్వగా కోలుకుంటారని తనకు నమ్మకముందన్నారు. కొద్దినెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్.. శుక్రవారం అధికారులతో చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను HYD జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.