AP: రాష్ట్రంలో వారానికి ఐదు పనిదినాలు అమలు చేయాలని, విద్యుత్ వాహనాల కొనుగోలుకు రాయితీలు ఇవ్వాలని ఏపీ ఐకాస అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, దామోదరరావు కోరారు. పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు జూన్ 7న కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు.