AP: అరసవల్లి సూర్యనారాయణస్వామివారిని సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో స్వామివారిపై సూర్యకిరణాలు పడలేదు. నిర్ణీత సమయంలో కనిపించే ఈ అద్భుతమైన దృశ్యాన్నీ కనులారా దర్శిస్తే.. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.