యూపీ ఆగ్రాలో 29 ఏళ్ల మహిళ తన 36 ఏళ్ల ప్రియుడితో కలిసి హోటల్‌కు వచ్చింది. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మహిళ తన వెంట తెచ్చుకున్న ‘హ్యామర్ (సుత్తి)’తో అతడి తలపై బాదింది. ప్రియుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే పదునైన వస్తువుతో అతడి గొంతు కోసింది. హత్య జరిగిన తర్వాత ఆ మహిళ హోటల్ రిసెప్షన్‌కు వెళ్లి సిబ్బందికి తన ప్రియుడిని చంపేశానని చెప్పింది.