AP: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపై PM మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించి, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాద వార్త తనను కలచివేసిందని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.