TG: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్దంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. ఇందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.