TG: పొత్తులపై మాజీమంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు తమకు కలిసి రావని అన్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో తమకు, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని తెలిపారు. టీడీపీలో మంచి లక్షణాలు ఉన్నాయని.. ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారని చెప్పారు. తమ పార్టీలో అది లోపించిందని చెప్పారు.