తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రదర్శనపై వివాదం నెలకొంది. మల్టీప్లెక్స్‌ల తరహాలో 23 థియేటర్లు ‘పర్సంటేజీ’ పద్ధతిలో సినిమాలు ప్రదర్శించాలని ఫిల్మ్ ఛాంబర్ భావించగా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో ఉన్న ‘అద్దె ప్రాతిపదికన’ మాత్రమే ప్రదర్శనలు కొనసాగించాలని, పర్సంటేజీ విధానం కుదరదని నిర్మాతలు స్పష్టం చేయడంతో సందిగ్ధత ఏర్పడింది.