జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు మలయాళ నటుడు టొవినో థామస్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.