గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై మెరిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన అయ్యప్ప దీక్ష గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చిరంజీవి సూచనతో 17 ఏళ్ల నుండే ఈ దీక్ష ప్రారంభించానని, ఇది తనలో క్రమశిక్షణను పెంచిందని తెలిపాడు. అనవసర విషయాలకు దూరంగా ఉంటూ, ఆలోచనలను నియంత్రించుకోవడానికి, మానసిక ప్రశాంతత పొందడానికి ఈ దీక్ష ఎంతో తోడ్పడుతుందని అన్నాడు.