GDWL: సమానత్వానికి ప్రతీకగా డా.బీ.ఆర్ అంబేద్కర్ నిలిచారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బాబాసాహెబ్ ఆలోచనలు నేటి పాలనా వ్యవస్థలకు మార్గదర్శకమని చెప్పారు. పోలీస్ శాఖలో సామాజిక బాధ్యత అవసరమని పిలుపునిచ్చారు.