BDK: సింగరేణి భవన్లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకను ఇవాళ ఘనంగా నిర్వహించారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న జాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని వారు పిలుపునిచ్చారు.