HYD: ఆర్టీసీ అభివృద్ధికి శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమం కోసం తాము ఎప్పుడూ ముందుంటామని, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని RTC వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఉద్యోగులు ఎక్కడికీ వెళ్లరని, ఇక్కడే ఉంటారని భరోసా ఇచ్చారు. డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చుకోవడం ద్వారా సిబ్బంది అందరూ ఇక్కడే ఉండి పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.