AP: మాజీ సీఎం జగన్ తీరు ఉగ్రవాదులకంటే దారుణంగా ఉందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరిగిందని, అరాచక పాలనతో రాష్ట్రాన్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టారని విమర్శించారు. ఇటీవల జరిగిన తోట చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించారు. సామాన్య కార్యకర్తను అతి కిరాతకంగా హత్య చేయడమంటే.. ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే అని పేర్కొన్నారు.