GNTR: అమరావతిలో నందమూరి బసవతారక రామారావు క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. దీనిని రూ.650 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. అత్యాధునిక వసతులతో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం సంబంధిత అధికారులకు తాజాగా దరఖాస్తు చేశారు. త్వరలోనే ఈ ఆసుపత్రి పనులు ప్రారంభం కానున్నాయి.