ఆస్కార్ వేడుకలకు సంబంధించి అకాడమీ కీలక ప్రకటన చేసింది. 99వ ఆస్కార్ వేడుకను 2027 మార్చి 14న, చారిత్రాత్మక 100వ ఆస్కార్ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నారు. హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుకలు ఏబీసీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సినిమా రంగంలో ఈ మైలురాయి వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.