నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారైంది. ‘రా రా ధీవర’ అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక యోధుడి స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.