Husband Killed His Wife
Crime: హైదరాబాద్‌లోని బోరుబండలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తాను చనిపోయింది. బోరుబండ పీఎస్ పరిధిలోని రాజ్‌నగర్‌లో ఉంటున్న జ్యోతి(31) బంజారాహిల్స్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. ఈమె భర్త సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. జ్యోతికి అర్జున్(4), ఆదిత్య(2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల ఇద్దరికి విషమిచ్చి.. జ్యోతి ఉరి వేసుకుంది. భార్య, పిల్లల మృతిని తట్టుకోలేక భర్త పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Breaking news : ఇద్దరు కూతుళ్ళను చంపి తండ్రి ఆత్మహత్య

