కర్నూలు: అమరావతి ఏపీ రాజధానిగా పార్లమెంటులోని లోక్ సభ ఆమోదించడం హర్షనీయమని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరు మండలం జాలవాడిలో ఆర్అండ్బీ రహదారి నిర్మాణానికి టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డితో కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఆమోదం పొందడంతో జగన్కు మతిభ్రమించిందన్నారు.