GNTR: తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ సాంబశివరావు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, అల్లర్లు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా నేరాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని సీఐ సూచించారు.