NLR: బుచ్చి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతుల కోసం కోదండ రామస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణ రెడ్డి వైద్య అధికారి పద్మజకు రూ. 50 వేల చెక్కును అందజేశారు. వైద్యాధికారి పద్మజ దొడ్ల వంశీకుల సేవలను ప్రశంసించారు. ఆసుపత్రి స్థలం కూడా దొడ్ల కుటుంబీకులె ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఉన్నారు.