GNTR: ప్రత్తిపాడు ఈదులపాలెంలోని కాటూరి మెడికల్ కళాశాల 22వ గ్రాడ్యుయేషన్ వేడుకలకుబుధవారం ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన పట్టాలు అందజేశారు. డాక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి నవతరం వైద్యులను అభినందిస్తూ, వృత్తిలో రాణించాలని గవర్నర్ ఆకాంక్షించారు.