NDL: ఆత్మకూరు మండలం సిద్ధపల్లెలో వడదెబ్బ తగిలి బండి నడిపి నాగిరెడ్డి (85) అనే ఉపాధి కూలీ ఇవాళ మృతి చెందారు. పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి కూలీలు అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వృద్ధాప్యంలోనూ పనికి వచ్చిన నాగిరెడ్డి మరణం గ్రామంలో విషాదం నింపింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని స్థానికులు కోరారు.