KKD: పెద్దాపురం పట్టణంలోని ప్రసన్న ఆంజనేయ కాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డును పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, జనసేన జిల్లా అద్యక్షులు తుమ్మల రామస్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు రాజు, మున్సిపల్ అధికారులు, కుటమి నాయకులు పాల్గొన్నారు.