ATP: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీములపై టౌన్ ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. నిబంధనలు పాటించి పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.