E.G: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లలో భాగంగా సీతానగరం మండలంలోని స్నాన ఘట్టాలను కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుష్కర్ నగర్లు, పార్కింగ్ స్థలాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. తాగునీరు, పారిశుధ్యం మెరుగుపరచాలని సూచించారు.