అన్నమయ్య: జీవామృతంతో విత్తనాలను శుద్ధి చేస్తే మొలకల శాతం పెరుగుతుందని ఎన్ఎఫ్ఐ యశోదమ్మ తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయం, జీవామృతం, కషాయాల తయారీపై అవగాహన కల్పించారు. ఈ విధానాలతో నేల సారం పెరిగి, పంటలకు మంచి దిగుబడులు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.