ATP: ‘పీ4 – జీరో పావర్టీ’ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. శింగనమల ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6,882 బంగారు కుటుంబాలను గుర్తించగా, 1,654 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.