SS: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టణంలోని 9, 10 వార్డుల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మశానంపేట మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.