TPT: భక్తుల కోసం శ్రీకాళహస్తి దేవస్థానం టెంపుల్ టికెట్ వెండింగ్ మెషిన్ (TTVM)లను అందుబాటులోకి తెచ్చింది. వీటి పనితీరును ఆలయ ఛైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. టిక్కెట్ల కోసం క్యూలో ఎక్కువసేపు నిలబడకుండా ఇందులో తీసుకోవాలని సూచించారు. వేగవంతమైన సేవలు అందించడంలో TTVMలు ఉపయోగపడతాయని తెలిపారు.