కర్నూలు నగరంలోని దేవనగర్లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. వృద్ధులు, వికలాంగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.