సత్యసాయి: మహిళా బిల్లుకు మద్దతు తెలిపేందుకు మంత్రి సవిత ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్లో ఈ కీలక బిల్లుపై నేడు జరిగే చర్చను ఆమె ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మహిళా సాధికారతకు ఈ చట్టం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయంగా పెద్దపీట వేసినట్లవుతుందని వెల్లడించారు.