గుంటూరు కలెక్టరేట్లో పారిశుద్ధ్యం పూర్తిగా అదుపు తప్పింది. కార్యాలయాల నుంచి వచ్చిన చెత్త, వాడిన ప్లేట్లు ఎక్కడపడితే అక్కడ పడేయడంతో ఆవరణ చెత్తకుప్పలతో నిండిపోయింది. దీంతో దుర్వాసన తీవ్రంగా వ్యాపించి, పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శుభ్రతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.