NTR: విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో పొలాల్లో ఆరబోసిన వరి ధాన్యాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని, కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎంచుకుని ఆ టైమ్‌కి అక్కడికి వెళ్లి ధాన్యం అమ్ముకోవచ్చు అన్నారు.