నెల్లూరు 33వ డివిజన్లో రూ.35 లక్షలతో నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను మంగళవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ నియోజకవర్గంలో ప్రతి వార్డు, గ్రామాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.