కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర వెస్ట్ జోన్ 43, 44, 45 డివిజన్లలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. తడి-పొడి చెత్త వేర్వేరు చేయాలని ప్రజలకు సూచించారు. నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు.