కృష్ణా: చల్లపల్లి అభివృద్ధికి ఎంపీ విజయేంద్ర ప్రసాద్ సహకారం అభినందనీయం అని స్వచ్ఛ చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ అన్నారు. గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి గురించి తెలుసుకుని చల్లపల్లి అభివృద్ధికి ఆయన తమ ఎంపీ లాడ్స్ ద్వారా రూ.50 లక్షలు కేటాయించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాదులో డా.డి.ఆర్.కె.ప్రసాదు, డాక్టర్ పద్మావతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.