KRNL: ఆదోనిలో విశ్వగురు బసవేశ్వర 895వ జయంతి సందర్భంగా ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సోమవారం DHPS అధ్యక్షుడు కొత్తూరు ఈరన్న, కార్యదర్శి విజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీపీఐ నాయకులు వీరేష్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడు సమానత్వానికి కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు.