NTR: తిరువూరులో జాతీయ రహదారి ఆక్రమణల తొలగింపుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రామచంద్రాపురం నుంచి తిరువూరు వరకు 36 కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణలు గుర్తించినట్లు తెలిపారు. చీమలపాడు, కంభంపాడు, తిరువూరులో ఇవి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.