GNTR: తెనాలి పినపాడు గేటు సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి (55) మృతి చెందాడు. హౌరా-బెంగళూరు ఎక్స్ప్రెస్ పట్టాలు దాటుతున్న సమయంలో అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.