CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.