NTR: అంగన్వాడీలకు వేతనాలు పెంపుదల, వేసవి సెలవులు, గ్రాడ్యుటి చట్టం గైడ్ లైన్ రూపొందించాలని, మినీ సెంటర్లో అన్నిటిని అప్డేట్ చేయాలని అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో తిరువూరు డీపీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ మేరకు సీడీపీవోకు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరావు, అంగన్వాడీ యూనియన్ పద్మ, నాగమణి, ఉష పాల్గొన్నారు.