నంద్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశాలతో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆశ్రఫ్ బాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. నిషేధిత వస్తువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు.