సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని వినాయకనగర్‌లో డ్రైనేజీ కాలువ, వీధి విద్యుత్ లైన్, వీధి కొళాయి ఏర్పాటు చేయాలని సీపీఎం, భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. సోమవారం మండల ఎంపీడీవో వెంకటలక్ష్మికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో ప్రాథమిక సదుపాయాల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పెద్దన్న వివరించారు.