ASR: రంపచోడవరం మండలం దేవరాతిగూడెం (ఫోక్స్పేట సమీపంలో) వద్ద ఇవాళ పులి దాడిలో ఓ పాడి ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆవును చంపిన అనంతరం కొంత భాగం తిని, మిగిలిన కళేబరాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు. అయితే ఆవు పులి దాడిలోనే మృతి చెందిందా అనే విషయాన్ని అటవీశాఖ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.