NDL: డోన్ మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సిబ్బంది, శానిటరీ వర్కర్లకు క్షయ (టీబీ) వ్యాధిపై అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాకాతుమ్, సూపర్వైజర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఛాతి ఎక్సరే, స్పిరోమీటర్ పరీక్షల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. కొత్త రోగులను గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని వారు తెలిపారు.