SS: చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన వసంత్ మేళాలో పాల్గొని ధర్మవరం చేనేత ఖ్యాతిని చాటిన జాతీయ అవార్డు గ్రహీత నాగరాజును టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ గురువారం ఘనంగా సన్మానించారు. చేనేత కళా వైభవాన్ని ఖండాంతరాలు దాటించి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన నాగరాజు ప్రతిభ ప్రశంసనీయమని కొనియాడారు. మన సంస్కృతిని విదేశాల్లో ప్రతిబింబించేలా చేశారని అన్నారు.