ప్రకాశం: మర్రిపూడి మండలంలో నేడు జరిగిన పదో తరగతి పరీక్షలకు 379 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 376 మంది హాజరైనట్లు ఎంఈఓ రంగయ్య తెలిపారు. జడ్పీహెచ్ పాఠశాలలో 234 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 232 మంది హాజరై ఇద్దరు విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జూనియర్ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రంలో 145 మందికి 144 మంది హాజరైనట్లు ఎంఈఓ రంగయ్య తెలిపారు.